తెలంగాణలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై కేంద్రం పచ్చి అబద్ధాలు ఆడుతున్నదని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్రం గోబెల్స్ ప్రచారానికి దిగిందని శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. మొన్న గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలు తెలంగాణ నుంచి రాలేదని చెప్పిన కేంద్రం.. ఈరోజు మెడికల్ కాలేజీల ఏర్పాటుపైనా లోక్ సభ వేదికగా దుష్ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణ నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయ మంత్రి భారతీ పవార్ పార్లమెంట్లో చెప్పడం బాధాకరమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించిందని తెలిపారు. అయినా కేంద్ర మంత్రులు పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడుతూ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారని మండిపడ్డారు. కేంద్రం సహకరించకపోయినా సీఎం కేసీఆర్ నేతృత్వంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని హరీశ్‌రావు చెప్పారు.
#BJP lead govt is misleading the parliament & the nation by saying that Telangana state never approached the Center for sanction of new medical colleges. #Telangana made several representations to the Centre for medical colleges, but not a single medical college sanctioned. 1/2 pic.twitter.com/ykzOmMtIbO
— Harish Rao Thanneeru (@trsharish) March 25, 2022