Huzurabad | బొట్టుబిళ్లలకు ఆశపడొద్దు.. మహిళా కూలీలతో మంత్రి హరీశ్‌రావు ముచ్చట
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మహిళా కూలీలతో ముచ్చటించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను కూలీలకు హరీశ్‌రావు వివరించారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మహిళా కూలీలతో ముచ్చటించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను కూలీలకు హరీశ్‌రావు వివరించారు.
మహిళా కూలీలు, హరీశ్‌రావు మధ్య సంభాషణ
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సిలిండర్, పెట్రోల్, డిజీల్, గ్యాస్ ధరలు పెంచింది. సీఎం కేసీఆర్ ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, 24 గంటల ఉచిత కరెంట్, ఆరు కిలోల బియ్యం ఇచ్చిండు. అవతలి పార్టీ వాళ్లు బొట్టుబిళ్లలు, గడియారం ఇచ్చిండు అని పువ్వు గుర్తుకు ఓటేయొద్దు. రూపాయి బొట్టుబిళ్లకు, అరవై రూపాయాల గడియారానికి ఓటేస్తే ఏం రాదన్నారు. దానికి స్పందించిన మహిళలు.. అలా ఎట్ల ఓటేస్తాం. అరవై రూపాయాలకు ఏం వస్తది అని అన్నారు.
సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గానికి 4 వేల ఇండ్లు ఇచ్చారు. కానీ ఈటల రాజేందర్ ఒక్క డబుల్ బెడ్రూం కూడా కట్టించి ఇవ్వలేదు. సిద్దిపేట నియోజకవర్గంలో 3,600 ఇండ్లు కట్టి గృహ ప్రవేశాలు చేయించాను. ఈటల రాజేందర్ పట్టించుకోలేదు. ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు. మంత్రిగా ఉండి ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. రేపు గెలిచి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటే ఏం అభివృద్ధి అయితదో మీరు ఆలోచించాలి. మీరు కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనును గెలిపించండి. మీకు వచ్చిన 4 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను ఆరు నెలల్లో పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేయిస్తానని మహిళా కూలీలకు మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

