కామారెడ్డి, సిద్దిపేట ్ల మెజార్టీల కన్నా ఒక్క ఓటైనా గజ్వేల్‌లో కేసీఆర్‌కు ఎక్కువ వచ్చేలా చూడండి. అప్పుడు గజ్వేల్‌లోనే ఉండాలని సీఎం కేసీఆర్‌ను ఒప్పించే పూచీ తీసుకుంటా.
– మంత్రి హరీశ్‌రావు
గజ్వేల్/నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 3: గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి. మూడోసారి ముఖ్యమంత్రిగా చూసేందుకు ఊరూరా కుల సంఘాలు కేసీఆర్‌కు జై కొడుతున్నాయి. మంగళవారం కేసీఆర్‌కు మద్దతుగా గజ్వేల్‌కు చెందిన ఆర్యవైశ్య సంఘం, గజ్వేల్ మండల పద్మశాలి సంఘం, గజ్వేల్ మండల కుమ్మర సంఘం, గజ్వేల్ రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. తీర్మాన పత్రాలను గజ్వేల్ పర్యటనలో ఉన్న ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడంతో దేశం చూపు గజ్వేల్‌పై పడిందని చెప్పారు.
గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్‌కు లక్షకు పైచిలుకు ఓట్లు వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. కామారెడ్డి, సిద్దిపేట నియోజకవర్గాల్లో మెజార్టీల కన్నా ఒక్క ఓటైనా గజ్వేల్‌లో కేసీఆర్‌కు ఎక్కువ వచ్చేలా చూడాలని, అప్పుడు కామారెడ్డి నియోజకవర్గం వద్దు గజ్వేల్‌లోనే ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించే పూచీ తాను తీసుకుంటానని మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. కేసీఆర్ ఎక్కడుంటే అక్కడే అనుకున్న దానికంటే ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. గజ్వేల్ పేరు చెబితేనే ఇతర ప్రాంతాల్లో గౌరవం పెంచే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ అభివృద్ధి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ వెంటే నడుస్తాం.. ఊరూరా తీర్మానాలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు కొనసాగుతున్నాయి. సీఎం కే చంద్రశేఖర్‌రావు ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీనే మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు ముక్తకఠంతో నినదిస్తున్నారు. గ్రామాలవారీగా, కుల సంఘాలవారీగా మద్దతు తెలుపుతూ తీర్మానాలు చేస్తున్నారు. ఇతర పార్టీల వారు ఎవరూ తమ గ్రామాలకు, తమ వాడలకు, తమ ఇంటికి రావొద్దని ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సోమ్లనాయక్ తండావాసులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికే తామంతా ఓట్లు వేస్తామని తీర్మానించారు. ఈ మేరకు స్పీకర్‌ను కలిసి తీర్మాన ప్రతులను అందజేశారు.
సీఎం కేసీఆర్, పోచారం శ్రీని వాసరెడ్డి వల్లే తమ తండా అభివృద్ధిపథంలో సాగుతున్నదని, వారికి ఓటు ద్వారా ధన్యవాదాలు తెలుపుకుం టామని ఈ సందర్భంగా తండావాసులు పేర్కొన్నారు. తమ గ్రామానికి ఇతర పార్టీల వారు ఎవరూ రావొద్దని స్పష్టం చేశారు. స్వరాష్ట్రం లోనే తండాలు గ్రామ పంచాయ తీలుగా మారాయని, మా తండాను మేమే పాలించుకుంటున్నామని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ గ్రామానికి చెందిన 130 మంది మత్స్యపారిశ్రామిక సంఘం సభ్యు లు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ మేరకు నిజాంసాగర్ మండల పరిషత్ కార్యాలయంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుర్గారెడ్డికి తీర్మాన పత్రాన్ని అందజేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డికి మద్దతుగా ఉంటామని దళిత మహిళలు ప్రకటించారు. కందుగుల అంబేద్కర్‌కాలనీలో మంగళవారం మహిళలు సమావేశమయ్యారు. కౌశిక్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకొని దళితబంధు ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకుంటామని తీర్మానం చేశారు.