హైదరాబాద్: పార్టీ నాయకులు, కార్యకర్తలకు మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల గుండెల నిండా… గులాబీ జెండా ఉందని చెప్పారు. 2001లో తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షల్లోంచి సీఎం కేసీఆర్ నాయకత్వంలో పార్టీ ఆవిర్భవించిందన్నారు. రాష్ట్రం కోసం కొట్లాడి, స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నది వెల్లడించారు. కోట్లాది ప్రజల మద్దతు, కార్యకర్తల బలంతో టీఆర్ఎస్ సగర్వంగా 21వ వసంతంలోకి అడుగుపెట్టిందని ట్వీట్ చేశారు. పార్టీ ఏర్పాటు సందర్భంగా కేసీఆర్తో తాను ఉన్న ఫొటోలను షేర్ చేశారు.
టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేశవిదేశాల్లోని 'గులాబీ' అభిమానులకు..
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు..
తెలంగాణ ప్రజల గుండెల నిండా… గులాబీ జెండా!!#21YearsOfTRS
2/2— Harish Rao Thanneeru (@trsharish) April 27, 2022