వారంలో పోలీస్ నోటిఫికేషన్.. సిద్ధంగా ఉండండి: మంత్రి హరీశ్ రావు
Minister Harish rao | వారం రోజుల్లో పోలీస్ ఉద్యోగల భార్తీకి నోటిఫికేషన్ వస్తున్నదని, సిద్ధంగా ఉండాలని ఉద్యోగార్థులకు మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. ప్రభుత్వం భర్తి చేస్తున్న 80 వేలకుపైగా ఉద్యోగాల్లో 20 వేల ఖాళీలు పోలీస్ శాఖలోనే ఉన్నాయని
సంగారెడ్డి: వారం రోజుల్లో పోలీస్ ఉద్యోగల భార్తీకి నోటిఫికేషన్ వస్తున్నదని, సిద్ధంగా ఉండాలని ఉద్యోగార్థులకు మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. ప్రభుత్వం భర్తి చేస్తున్న 80 వేలకుపైగా ఉద్యోగాల్లో 20 వేల ఖాళీలు పోలీస్ శాఖలోనే ఉన్నాయని చెప్పారు. పటాన్‌చెరూలో సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐ, కానిస్టేబుల్ శిక్షణ తరగతులను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. సమయాన్ని వృధా చేయకుండా చదువుకొని అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలీస్ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ కల్పించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కార్ మాత్రమేనని చెప్పారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా రిజర్వేషన్లు కల్పిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేస్తున్నామని, కేంద్రంలో 15 లక్షలకుపైగా ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ధరలు పెంచినందుకు, ఉద్యోగాలు ఇవ్వనందుకు, ప్రజల జీవితాలను ఆగం చేస్తున్నందుకు యాత్ర చేస్తున్నారా అని ప్రశ్నించారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ లబ్ది పొందాలని చూస్తున్నదని విమర్శించారు.
ఉద్యోగాల భర్తీ గురించి తెలంగాణ విద్యార్థులు బీజేపీని ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. ట్విటర్ వేదికగా ప్రధాని మోదీ, బండి సంజయ్, కిషన్ రెడ్డిలను ప్రశ్నించాలన్నారు. విద్యార్థుల కోరిక మేరకు సీఎం కేసీఆర్ మూడేండ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

