హైదరాబాద్: డిసెంబర్ 9.. తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రాణాలను పణంగా పెట్టిన దీక్షా దక్షుడి నాయకత్వంలో.. ఉద్యమం విజయ తీరాలకు చేరిన రోజని అన్నారు. ఉద్యమ వీరుని ప్రస్థానానికి నేటి పన్నెండేండ్లు పూర్తయ్యాయని ట్వీట్ చేశారు.
‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో ఉద్యమ నాయకుడు కేసీఆర్ 2009, నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష ప్రరంభించారు. దీంతో ఉద్యమ తీవ్రత రోజురోజుకు అధికమవుతుండటంతో.. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించిన విషయం తెలిసిందే.
‘‘తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు ఇది
ప్రాణాలను పణంగా పెట్టిన దీక్షాదక్షుడి నాయకత్వంలో..
ఉద్యమం విజయతీరాలకు చేరిన రోజు
తెలంగాణ ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలిపిన రోజు.
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో…!
అన్న ఉద్యమ వీరుని ప్రస్థానానికి నేటి తో పన్నేడేండ్లు..’’ అని మంత్రి హరీశ్ రావు ట్విటర్లో పోస్టు చేశారు.
తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు ఇది
— Harish Rao Thanneeru (@trsharish) December 9, 2021
ప్రాణాలను ఫణంగా పెట్టిన ధీక్షాదక్షుడి నాయకత్వంలో..
ఉధ్యమం విజయతీరాలకు చేరిన రోజు
తెలంగాణ ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలిపిన రోజు.
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో…!
అన్న ఉద్యమ వీరుని ప్రస్థానంకి నేటి తో పన్నేడేండ్లు..#KCR #Telangana pic.twitter.com/q7xH9QPCQS
తెలంగాణ ప్రకటన వచ్చి 12 ఏండ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 9, తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజన్నారు.
డిసెంబర్ 9, తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు, స్వరాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఉద్యమ నాయకునిగా గౌరవ కేసిఆర్ గారు తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చి, స్వరాష్ట్ర ప్రకటన సాధించిన రోజు. ప్రకటన వచ్చి 12 ఏళ్లు అయిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. pic.twitter.com/hSuBSEoDw8
— Satyavathi Rathod (@SatyavathiTRS) December 9, 2021