Minister Harish rao | కాళేశ్వరం నీళ్లు రాకపోతే యాసంగి పంటలు పండేనా? : మంత్రి హరీశ్ రావు
కాంగ్రెస్ హయాంలో కాలం కోసం ఎన్నో తిప్పలు పడ్డామని, కానీ ఇప్పుడు కాలం కాకున్నా మనకు కాళేశ్వరం నీళ్లు ఉన్నాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. కాళేశ్వరం (Kaleshwaram) నీళ్లు రాకపోతే యాసంగి పంటలు పండేనా అని ప్రశ్నించారు.
సిద్దిపేట: కాంగ్రెస్ హయాంలో కాలం కోసం ఎన్నో తిప్పలు పడ్డామని, కానీ ఇప్పుడు కాలం కాకున్నా మనకు కాళేశ్వరం నీళ్లు ఉన్నాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. కాళేశ్వరం (Kaleshwaram) నీళ్లు రాకపోతే యాసంగి పంటలు పండేనా అని ప్రశ్నించారు. నీళ్లు లేకపోతే జీవం లేదు, నీళ్లు లేకపోతే బతుకుదెరువు లేదన్నారు. అలాంటి జీవాన్ని సీఎం కేసీఆర్ ఇచ్చారని చెప్పారు. సిద్దిపేటలోని టీటీసీ భవన్లో దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 233 మంది దివ్యాంగులకు ఉపకరణాలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివ్యాంగులకు దేశంలోనే అత్యధికంగా రూ.4016 పింఛను అందిస్తున్నామన్నారు. దివ్యాంగుల పట్ల మానవతా దృష్టి, ప్రేమతో దగ్గరికి తీసుకుంటున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.1000 మించి పింఛన్ ఇవ్వడం లేదని విమర్శించారు.
వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ పార్టీ హయాంలో దొంగరాత్రి కరెంటు, పేలిన ట్రాన్స్ఫార్మర్లు, కాలిన మోటర్లు అని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు తిట్ల పోటీలో పోటీ పడుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ వడ్లు పుట్లు పుట్లుగా పండించేందుకు పోటీ పడుతున్నారని తెలిపారు. మన వడ్లు కొనడానికి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అడుగుతున్నాయని చెప్పారు. తెలంగాణను దేశ ధాన్యాగారంగా సీఎం కేసీఆర్ మార్చారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP
- CM KCR
- Congres
- Free power
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

