Minister Harish Rao | సిద్దిపేట జిల్లాలో భరోసా, సఖి కేంద్రాలను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు
Minister Harish Rao | సిద్దిపేట జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన భరోసా, సఖి కేంద్రాలను రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్, ఏడీజీ శిఖా గోయల్‌తో కలసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన భరోసా, సఖి కేంద్రాలను రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్, ఏడీజీ శిఖా గోయల్‌తో కలసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళా సంరక్షణ కోసం
సఖి, భరోసా కేంద్రాలతోపాటు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, బాల రక్ష భవన్ కేంద్రం కలిపి ఒకే చోట ఏర్పాటు చేశామన్నారు.
ఇక్కడ బాధిత మహళలకు వ్యక్తిగత గోప్యతతో పాటు కౌన్సిలింగ్, లీగల్ సపోర్టుతో కూడిన రక్షణ లభిస్తుందని మంత్రి చెప్పారు. ఇలాంటి రక్షణ వ్యవస్థ ఉందని అందరికీ తెలిసేలా చర్యలు చేపడతామన్నారు. సీఎస్ఆర్ ద్వారా 1.8 కోట్ల రూపాయలతో సఖి, భరోసా కేంద్రాలను నిర్మించిన గొవ్రో పెట్రో కెమికల్ వారికి, లైబ్రరీని అందించిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ ఆకర్షణకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. సిద్దిపేటలో భరోసా, సఖి సెంటర్లు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో 2014లో ప్రారంభం చేసిన ఈ సెంటర్లు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మహిళా భద్రత కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. ఏడీజీ శిఖా గోయల్ మాట్లాడుతూ.. రాష్ట్రం మొత్తం షీ టీమ్స్ ఏర్పాటు చేశామని చెప్పారు.
దేశం మొత్తంలో తెలంగాణలో మాత్రమే ప్రతి పోలీస్ స్టేషన్ మహిళా విభాగం కలిగి ఉన్నదని శిఖా గోయల్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం చిన్నారులు, మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించిందన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి మహిళల అక్రమ రవాణాను అరికడుతున్నామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

