Harish Rao | హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హరీశ్ రావు సీఎం రేవంత్‌రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయడంలేదని, పారిశుధ్య కార్మికులకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు ఇవ్వని పరిస్థితి ఏర్పడిందని లేఖలో పేర్కొన్నారు.
కవితతో కేటీఆర్, హరీశ్ ములాఖత్
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితతో కేటీఆర్, హరీశ్‌రావు శుక్రవారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు ధైర్యం చెప్పారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉన్నదని, త్వరలోనే బెయిల్ లభిస్తుందని భరోసా ఇచ్చారు. అనంతరం సుప్రీంకోర్టులో వేయనున్న బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలో న్యాయ నిపుణుల బృందంతో కేటీఆర్, హరీశ్‌రావు చర్చించారు.
కేకే రాజీనామా ఆమోదం
రాజ్యసభ సెక్రటేరియట్ బులెటిన్ విడుదల
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : రాజ్యసభ సభ్యత్వానికి కే కేశవరావు చేసిన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆమోదించారు. రాజీనామాను ఆమోదించినట్టుగా రాజ్యసభ సెక్రటేరియట్ శుక్రవారం బులెటిన్ విడుదల చేసింది.