హైదరాబాద్ : సూర్యాపేట మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. బంజారాహిల్స్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో 15 నుంచి 18 ఏండ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను మంత్రి హరీశ్‌రావు, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యాపేట మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటనపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు.
సూర్యాపేట మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ అంశం ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఘటనపై కమిటీ ఏర్పాటు చేసి, విచారణ జరుపుతున్నామని తెలిపారు. ర్యాగింగ్ జరిగిందా? లేదా? అనేది కమిటీ విచారణలో తేలనుంది. మధ్యాహ్నం వరకు కమిటీ నివేదిక సమర్పించనుంది. ర్యాగింగ్ జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీకుంటామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.