సిద్దిపేట : నిత్యం ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండే మంత్రి హరీశ్‌రావు.. ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్రికెట్‌పై తనకున్న అభిమానాన్ని ప్రదర్శించారు. సిద్దిపేట పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో సూపర్ ఓవర్ ఫుడ్ అండ్ స్పోర్ట్స్ – డ్రైవ్ ఇన్ హోటల్‌ను మంత్రి హరీశ్‌రావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి స్టేడియంలో సరదాగా బ్యాట్ పట్టారు. ఏ బంతిని కూడా మిస్ చేయకుండా వినూత్నమైన షాట్లతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. హరీశ్‌రావు బ్యాటింగ్ అదరహో అంటూ అక్కడున్న వారు అభినందించారు.
సిద్దిపేటలో సరదాగా బ్యాట్ పట్టిన మంత్రి హరీశ్‌రావు.. వినూత్న షాట్లతో అందర్నీ ఆశ్చర్యపరిచారు.. @trsharish pic.twitter.com/ztwBx4Gbux
— Namasthe Telangana (@ntdailyonline) December 15, 2021