మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 11:23:55

డ్రై డేలో హరీష్‌రావు.. నీటి నిల్వలను తొలగించాలని విజ్ఞప్తి

డ్రై డేలో హరీష్‌రావు.. నీటి నిల్వలను తొలగించాలని విజ్ఞప్తి

సిద్దిపేట : సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హనుమాన్‌ నగర్‌లో నిర్వహించిన డ్రై డేలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. హనుమాన్‌ నగర్‌లోని ప్రతి ఇంటిని మంత్రి కలియతిరిగారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నివాసితులకు సూచించారు. ఇంటి పరిసరాల్లో నిలిచిన నీటి నిల్వలను తొలగించి, వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి పౌరుడు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు విధిగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు సమయం కేటాయించాలి. డ్రై డే అందరూ పాటించి ఒక్క నీటి చుక్క నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు. 


logo