ఇదీ సౌత్ ఇండియా స్టోరీ
దేశంలో బీజేపీ పతనం దక్షిణాది నుంచే ప్రారంభమైందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ‘ఇదీ సౌత్ ఇండియా స్టోరీ’ అంటూ ఆయన ట్విటర్లో స్పందించారు. కర్ణాటక ప్రజలకు బీజేపీ నుంచి విముక్తి లభించిందన్నారు. బీజేపీకి తెలంగాణలో ఎక్కడా డిపాజిట్ కూడా దక్కదని పేర్కొన్నారు. ‘బీజేపీ నుంచి కర్ణాటకకు విముక్తి లభించింది. దేశంలో భవిష్యత్తులోనూ ఇదే పునరావృతం కాబోతున్నది.
- కర్ణాటకకు బీజేపీ నుంచి విముక్తి తెలంగాణలో డిపాజిట్లు కూడా రావు: హరీశ్‌రావు
హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): దేశంలో బీజేపీ పతనం దక్షిణాది నుంచే ప్రారంభమైందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ‘ఇదీ సౌత్ ఇండియా స్టోరీ’ అంటూ ఆయన ట్విటర్లో స్పందించారు. కర్ణాటక ప్రజలకు బీజేపీ నుంచి విముక్తి లభించిందన్నారు. బీజేపీకి తెలంగాణలో ఎక్కడా డిపాజిట్ కూడా దక్కదని పేర్కొన్నారు. ‘బీజేపీ నుంచి కర్ణాటకకు విముక్తి లభించింది. దేశంలో భవిష్యత్తులోనూ ఇదే పునరావృతం కాబోతున్నది. బీజీపీ పతనం సౌత్ ఇండియా నుంచి ప్రారంభమైంది. తెలంగాణలో చివరికి డిపాజిట్లు కూడా రావు. కర్ణాటకలో కొత్తగా విజయం సాధించిన అభ్యర్థులకు, ఏర్పడబోయే ప్రభుత్వానికి నా అభినందనలు’ అని పేర్కొన్నారు.
అభివృద్ధి మరిచి మతాలు, దేవుని పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ పట్ల యావత్ దేశ ప్రజలు విసుగు చెందారనేందుకు కర్ణాటక ఎన్నికల ఫలితాలే నిదర్శనం. డబుల్ ఇంజిన్ సరార్ను తిరసరించి కర్ణాటక ప్రజలు బీజేపీకి చెంపదెబ్బలాంటి తీర్పు ఇచ్చారు. ప్రభుత్వరంగ సంస్థలు అమ్ముతూ దేశ సంపదను దోస్త్ అదానీకి ధారాదత్తం చేయడాన్ని ప్రజలు సహించలేకపోయారు.
– వేముల ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి
బీజేపీ అహంకారాన్ని కర్ణాటక ప్రజలు బద్దలు కొట్టారు. దేశ సమాఖ్య స్ఫూర్తికి గండికొడుతున్న బీజేపీని దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. దర్యాప్తు సంస్థలను విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్న బీజేపీ నిజస్వరూపాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించటం, దక్షిణ భారతదేశాన్ని సౌత్‌గ్రూప్ అని కించపరచిన తీరుకు ఈ తీర్పు చెంపపెట్టు.
– వీ శ్రీనివాస్‌గౌడ్, సాంస్కృతికశాఖ మంత్రి
మతతత్వ పార్టీకి తగిన గుణపాఠం
కర్ణాటకలో బీజేపీ ఓటమి దక్షిణ భారత ప్రజల విజయం. దక్షిణ భారతం నుంచి బీజేపీని ప్రజలు తరిమివేశారు. ప్రజల ఆకాంక్షలను, అవసరాలను అర్థం చేసుకోకుండా వివక్ష, విద్వేషాలను పెంచి పోషిస్తే ప్రజలు సహించరని బీజేపీకి అర్థం అయ్యేలా కర్ణాటక ప్రజలు తీర్పు ఇచ్చారు. కర్ణాటక ఫలితాలను చూసి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పులిని చూసి నక వాతలు పెట్టుకున్నట్టుగా ఉన్నది.సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్పైనే తెలంగాణ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నది.
-చంటి క్రాంతికిరణ్, ఎమ్మెల్యే అందోళ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

