సంగారెడ్డి : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్(BRS) గెలుపే లక్ష్యంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) ప్రచారంలో దూసుళ్తున్నారు. అందరిని కలుపుకుంటూ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ముందుకెళ్తున్నారు. పార్టీ విజయం కోసం ఏ అవకాశం వచ్చినా వదిలి పెట్టకుండా అందరిని సమన్వయం చేసుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా సంగారెడ్డి(Sangareddy)లోని సీపీఎం కార్యాలయంలో పార్టీ నేతలను(CPM leaders )మంత్రి కలిశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాల్సిందిగా సీపీఎం నేతలు చుక్క రాములు, బి.మల్లేశంను కోరారు. మంత్రి హరీశ్ రావు వినతి మేరకు ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో మద్దతు ఇస్తామని సీపీఎం నాయకులు హామీనిచ్చారు. కాగా, పఠాన్ చెరువు నియోజకవర్గంలో మాత్రమే సీపీఎం పోటీలో ఉంది.