దుబ్బాక : సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ పాఠశాల నిర్మాణ పనులకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గురువారం శంకుస్థాపన చేశారు. గతేడాది పదో తరగతి పరీక్ష ఫలితాలపై మంత్రి ఆరా తీశారు. వంద శాతం సాధించినట్లు మండల విద్యాధికారులు మంత్రికి వివరించారు. ఈ ఏడు బాసర ఐఐటీలో సీటు సాధించేలా అంతా ఇష్టపడి చదవాలని విద్యార్థినులకు మంత్రి సూచించారు. ఈ మేరకు విద్యార్థినిలతో కలసి మంత్రే స్వయంగా సెల్ఫీ దిగారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందర్రావు, స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.