మహబూబాబాద్ : జిల్లా పర్యటనలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాలో రేడియాలజీ సేవల భవనం, 41 పడకల జనరల్ వార్డ్, డెడికేటెడ్ పీడియాట్రిక్ కేర్ యూనిట్ ప్రారంభించారు.
దవాఖానలో అందుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, టీఎస్ ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.