హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీశ్ రావు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణ భగవానుడు అవతరించిన పర్వదినం శ్రీ కృష్ణాష్టమి అని చెప్పారు. అందరి జీవితాల్లో అడ్డంకులు తొలగించి సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ఈమేరకు మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.
శ్రీ కృష్ణ భగవానుడు అవతరించిన పర్వదినం శ్రీ కృష్ణాష్టమి. అందరి జీవితాల్లో అడ్డంకులు తొలగించి సుఖ సంతోషాలు నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.#KrishnaJanmashtami pic.twitter.com/PVuV245gGY— Harish Rao Thanneeru (@trsharish) August 19, 2022
హైదరాబాద్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు. బంజారాహిల్స్ ఇస్కాన్ గోల్డెన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణ నామస్మరణతో ఇస్కాన్ ఆలయాలు మారుమోగుతున్నాయి.