Minister Harish Rao | ‘మీరు చూపిస్తున్న ఆదరణకు ఏం చేసినా తక్కువనే’.. ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్‌రావు భావోద్వేగం
Minister Harish Rao | ‘మీరు నాపై చూసిస్తున్న ప్రేమకు నా కళ్లల్లో నీళ్లు వస్తున్నయ్. మీ ఆదరణకు ఎంత చేసినా తక్కువే. ఇంకా మీకు చాలా సేవ చేయాలి’ అంటూ మంత్రి హరీశ్‌రావు భావోద్వేగానికి గురయ్యారు. సిద్ధిపేట రూరల్ మండలం రాఘవాపూర్‌లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
Minister Harish Rao | ‘మీరు నాపై చూసిస్తున్న ప్రేమకు నా కళ్లల్లో నీళ్లు వస్తున్నయ్. మీ ఆదరణకు ఎంత చేసినా తక్కువే. ఇంకా మీకు చాలా సేవ చేయాలి’ అంటూ మంత్రి హరీశ్‌రావు భావోద్వేగానికి గురయ్యారు. సిద్ధిపేట రూరల్ మండలం రాఘవాపూర్‌లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. అంతకు ముందు సిద్దిపేట శివాజీ సర్కిల్ నుంచి రాఘవాపూర్ వరకు విద్యార్థి విభాగం యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో మంత్రికి ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, పార్టీ జెండాను మంత్రి ఆవిష్కరించారు.
అనంతరం కార్యక్రమంలో కార్యక్తరలనుద్దేశించి మాట్లాడారు. ‘మీ బలగం చూస్తుంటే ఎన్ని జన్మలు ఎత్తినా సరిపోదు. చివరి శ్వాస వరకు సేవ చేస్తా. మీకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టి ఇచ్చిన తక్కువే. ఈ గడ్డ గులాబీ అడ్డా రానే రాదు అన్న తెలంగాణను, కానే కాదు అన్న కాళేశ్వరాన్ని కట్టి మండుటెండల్లో మత్తల్లు కేసీఆర్ దుంకిస్తున్నారు’ అన్నారు. వెనుకట పంట వేయాలి అంటే మోగులు వైపు చూసేదని, నేడు కేసీఆర్ దయతో కాలంతో సంబంధం లేకుండా పంట వేయవచ్చన్నారు.
రూ.138కోట్ల వడ్లు తెలంగాణ వచ్చినప్పుడు పండితే.. నేడు రూ.1548 కోట్లు వడ్లు పండుతున్నాయన్నారు. కేసీఆర్ అనే అద్భుత దీపం వల్లనే పంటలు పండుతున్నాయన్నారు. రాష్ట్రం వచ్చాక ఎరువుల కోసం ఇబ్బంది లేదని, నేడు ప్రతి ఇంట్లో కేసీఆర్ ఉన్నాడన్నారు. కాళేశ్వరం దండగా అన్న ప్రతిపక్షాలు గ్రామాలలోకి వస్తే పండగ.. దండగో తెలుస్తుందన్నారు. మోదీ నిన్నటి సభలో రాష్ట్రం ప్రభుత్వం అభివృద్ధికి సహకరించడం లేదని బురద జల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మోదీ మాటలు దొంగే దొంగా అన్నట్లు ఉన్నాయని విమర్శించారు. మోదీ వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం అపిండని, కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టాలని రూ.30వేలకోట్లు ఆపిండన్నారు.
తెలంగాణ అభివృద్ధి ని బీజేపీ అడ్డుకుంటుందని, ఉత్తరప్రదేశ్ డబుల్ ఇంజన్ సర్కారులో కరెంట్ సరఫరా లేక ఆయిల్ పోసి మోటార్లు నడుపుతున్నారన్నారు. రెండు కోట్లతో పుల్లుర్ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం అభివృద్ధి చేసుకున్నామని, త్వరలోనే గృహలక్ష్మి కార్యక్రమం ప్రారంభం చేసుకుందామన్నారు. కాంగ్రెస్, బీజేపి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న చోట బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వలేదన్నారు. గాంధీ, నిమ్స్ ఆసుపత్రిల్లో ఉన్న సేవలు సిద్దిపేటలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పెట్టి అందిస్తామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

