నడక మార్గంలో తిరుమలకు చేరుకున్న మంత్రి హరీశ్‌రావు.. వీడియో
తిరుమల : శ్రీవారి దర్శనార్థం అలిపిరి నడక మార్గంలో మంత్రి హరీశ్‌రావు తిరుమలకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి మొదటి మెట్టు వద్ద మంత్రి కొబ్బరి కాయ కొట్టి తన నడకను ప్రారంభించారు. తిరుమలకు చేరుకున్న మంత్రి హరీష్ రావుకు శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద టీటీడీ అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం అలిపిరి నడక మార్గంలో నడచి వచ్చిన తెలంగాణ మంత్రి హరీష్ రావు.. pic.twitter.com/3ulqRQYVbJ
— Namasthe Telangana (@ntdailyonline) June 3, 2022
నాపై ప్రేమను సేవతో చాటండి
తన పుట్టినరోజైన శుక్రవారంనాడు తాను సిద్దిపేట, హైదరాబాద్‌లో ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు. ముందే నిర్ణయించుకొన్న వ్యక్తిగత కార్యక్రమంలో భాగంగా దూరప్రాంతంలో ఉండాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. తనపై ఉన్న ప్రేమను ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా చాటాలని అభిమానులు, కార్యకర్తలకు సూచించారు. శుభాకాంక్షలు చెప్పడానికి, ఆశీర్వదించడానికి వస్తామంటూ ఫోన్లు చేస్తున్నవారిని నిరాశ పరుస్తున్నందుకు మన్నించాలని గురువారం ట్వీట్ చేశారు. అభిమానుల ఆదరాభిమానాలు, ప్రేమను నా గుండెల్లో పెట్టుకుంటానని పేర్కొన్నారు.
అభిమానుల ‘హెల్పింగ్ చాలెంజ్’
మంత్రి హరీశ్‌రావు పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన అభిమానులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. శుక్రవారం హెల్పింగ్ చాలెంజ్‌ను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ కార్యకర్తలు కష్టాల్లో ఉన్న ఎవరికైనా సహాయం చేయాల్సి ఉంటుంది. సహాయం పొందినవారితో సెల్ఫీ దిగి, దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయాలి. ఇదేవిధంగా సహాయం చేయాలని స్నేహితులకు కూడా చాలెంజ్ విసరాల్సి ఉంటుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

