Minister Harish Rao | శ్రీరామ నవమి నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ (KCR Nutrition Kit) పంపిణీ చేయనున్నట్లు మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) ప్రకటించారు. మెదక్ (Medak) జిల్లాకేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రం ఆవరణలో 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ ఎంసీహెచ్ సేవల్లో మంచి స్థానంలో ఉందన్నారు. జనవరిలో 81శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగాయని, సౌకర్యాలు బాగుండడంతో ప్రజలు వస్తున్నారన్నారు. మెదక్ రామాయంపేట, నర్సాపూర్‌లో 90శాతం డెలివరీలు జరగాలని, ఈ మేరకు సిబ్బంది కృషి చేయాలన్నారు.
బిడ్డ పుట్టగానే కేసీఆర్ కిట్ అందజేస్తున్నామని, శ్రీరామ నవమి నుంచి కేసీఆర్ న్యూటిషన్ కిట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గర్భిణికి 4, 6,7 నెలలో ఇస్తామన్నారు. బలం లేక పుట్టే పిల్లలు తక్కువ బరుగువుతో పుడుతున్నారన్నాని, వారికి పౌష్టికాహరాన్ని పేదరికంతో వల్ల అందించలేకపోతున్నారన్నారు. న్యూట్రిషన్ కిట్‌లో ప్రోటీన్ పౌడర్, నెయ్యి, ఖజ్జురా తదితరాలుంటాయిన, వీటితో గర్భిణులు ఆరోగ్యంగా ఉంటారన్నారు. సీఎం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల కోసం రూ.250కోట్లు బడ్జెట్లో కేటాయించారన్నారు.
ప్రజల కోసం అన్ని విధాలా ఆలోచిస్తున్నామన్నారు. కాంగ్రెస్ కాలంలో నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు అనే వారని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు. ఎంసీహెచ్‌లో రూ.24కోట్లతో క్రికెట్ కేర్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. అత్యవసర సమయాల్లో గోల్డెన్ అవర్ అమృతకాలం లాంటిదని, కాలయాపన వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుందన్నారు. ఆసుపత్రిలో ఒకే రోజు 25 కాన్పులు చేశారని వైద్య సిబ్బంది అభినందించారు. వైద్యులు ఓపిక, ప్రేమతో కాన్పులు చేశారన్నారన్నారు.
ఆసుపత్రికి వచ్చే వారిలో తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులను చూసుకోవాలని చెప్పారు. దృష్టిలో లోపం ఉన్నా చాలా మంది డబ్బులు లేక, నిర్లక్ష్యం వైద్యం చేసుకోవడం లేదని, అలాంటి వారి కోసమే ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకువచ్చిందన్నారు. శిబిరాల్లో పరీక్షలు చేసి లోపాలను సరి చేస్తున్నట్లు చెప్పారు. రెండు రకాల దృష్టి లోపాలు పరీక్షలు జరుగుతున్నాయని, అద్దాల ఆర్డర్ ఇచ్చి ఇంటికే తీసుకువచ్చి ఇస్తారన్నారు. మెదక్‌లో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.