2017 నుంచి కేంద్రం, రాష్ట్రం మధ్య ఉత్త్తరాలు నడిచినా.. రాష్ట్ర బిల్లులో కొన్ని అంశాలపై హోంశాఖ వివరణ కోరినా.. రాష్ట్రం ఇచ్చిన సమాధానాలపై అదే హోంశాఖ సమీక్షించినా.. ఆఖరుకు ఈ సంవత్సరమే మార్చి 7న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి.. కోర్టు తీర్పునకు లోబడి బిల్లు అంశాన్ని ప్రాసెస్ చేస్తామని లేఖలో చెప్పినా.. కేంద్రానికి మాత్రం ఇవేమీ గుర్తు లేవు! ఇంత సుదీర్ఘ ప్రక్రియను, సాగిన ఉత్తర ప్రత్యుత్తరాలను కాదని.. ‘ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదు’ అని పచ్చిగా బొంకింది కేంద్ర ప్రభుత్వం!
2016 డిసెంబర్ 8 ఎస్టీల రిజర్వేషన్ 10% పెంచాలని చెల్లప్ప కమిషన్ సిఫారసు 2017 ఏప్రిల్ 16రిజర్వేషన్ పెంపు బిల్లుపై (ఎల్ఏ 6/2017) అసెంబ్లీ, మండలిలో చర్చ, ఆమోదం.
2017 మే 29 కేంద్ర హోం శాఖకు చేరిన బిల్లు.
2017 డిసెంబర్ 18 బిల్లుకు మద్దతు ఇస్తున్నామన్న కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ. రిజర్వేషన్ 9.08 శాతానికి ఎట్టిపరిస్థితుల్లో తగ్గకూడదని స్పష్టీకరణ.
2018 ఏప్రిల్ 26 కేంద్ర హోం శాఖ కోరిన వివరణలకు తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సమాధానం.
2018 ఏప్రిల్ 27 బిల్లుపై కేంద్ర హోం శాఖ సమీక్ష.
2022 ఫిబ్రవరి 9 రిజర్వేషన్ల పెంపు బిల్లు కేంద్రం వద్ద ఉన్నదని తమకు తెలుసన్న కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ప్రాసెస్ చేస్తామని హామీ.
2022 ఫిబ్రవరి 11 సత్యవతి రాథోడ్ రాసిన లేఖ అందిందన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.
2022 మార్చి 3 రిజర్వేషన్ల పెంపు బిల్లు తమ పరిశీలనలో ఉన్నదని, కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నామని తెలిపిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి.
హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): బక్వాస్ మాటలకు కేరాఫ్.. పచ్చి అబద్ధాలకు కేరాఫ్.. సోషల్ మీడియాలో ఫేక్ వార్తలకు ప్రసిద్ధి చెందిన బీజేపీ పాలకవర్గం.. ఇప్పుడు అత్యున్నత చట్టసభ లోక్‌సభలో కూడా తెలంగాణపై విషం కక్కింది. గిరిజనుల రిజర్వేషన్ల పెంపు బిల్లుపై ఐదేండ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచాలని 2017లోనే అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర హోంశాఖకు పంపింది. బిల్లు తమ వద్దకు చేరిందని కేంద్ర హోంశాఖ కూడా అక్నాలెడ్జ్ చేసింది. కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ కూడా గిరిజనుల రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన అంశం కేంద్రం పరిశీలనలో ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టంగా చెప్పింది. ఇప్పుడేమో పార్లమెంట్లో అసలు అలాంటి ప్రతిపాదనేదీ తమ వద్దకు రానేలేదని దారుణంగా అబద్ధమాడింది. బీజేపీ రెండు నాల్కల ధోరణిని మంత్రులు హరీశ్‌రావు, సత్యవతిరాథోడ్ మంగళవారం మీడియా సమావేశంలో ఎండగట్టారు. వాస్తవాలను ఆధారాలు సహా వెల్లడించారు.
రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గిరిజనుల ఆర్థిక, సామాజిక స్థితిగతులను అధ్యయనం చేయాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్.. చెల్లప్ప కమిషన్‌ను నియమించారు. ఈ కమిషన్ లోతుగా అధ్యయనం చేసి.. గిరిజనుల ఆర్థిక, సామాజిక స్థితిని ఉన్నతీకరించడానికి 6 శాతంగా ఉన్న రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం బిల్లును రూపొందించి.. 2017 ఏప్రిల్ 16న అసెంబ్లీ ఆమోదాన్ని పొందింది. అదే నెల 24న గవర్నర్ ఆమోదించారు. 29న కేంద్ర హోంశాఖకు పంపారు. బిల్లు తమకు చేరిందని కేంద్రం స్వయంగా ఒప్పుకొన్నది.
2017 డిసెంబర్ 18: రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ తెలంగాణ చేసిన బిల్లుకు కేంద్ర గిరిజన శాఖ మద్దతు తెలియజేస్తున్నదని కేంద్ర డిప్యూటీ సెక్రటరీ దిలీప్‌కుమార్ కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు. గిరిజనులకు 2011 లెక్కల ప్రకారం 9.08 శాతానికి తగ్గకుండా రిజర్వేషన్ కల్పించాలని సూచించారు.
కేంద్ర హోం శాఖ ఈ బిల్లులో కొన్ని అంశాలపై వివరణ కోరగా, 2018 ఏప్రిల్ 26న రాష్ట్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. మరుసటి రోజే కేంద్ర హోంశాఖ బిల్లుపై సమీక్షించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం హాజరయ్యారు.
ఎస్టీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని వెంటనే తేల్చాలంటూ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ 2021 ఫిబ్రవరి 5న, 2022 ఫిబ్రవరి 1న కేంద్ర గిరిజన మంత్రి అర్జున్ ముండాకు, 2022 ఫిబ్రవరి 1న కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు లేఖలు రాశారు. వీటికి వారు ప్రత్యుత్తరాలు సైతం రాశారు.
2022 ఫిబ్రవరి 9: కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్ ముండా రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌కు లేఖ రాశారు. ఇందులో ‘తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన ఎస్టీ రిజర్వేషన్ల పెంపు బిల్లు కేంద్ర హోం శాఖకు చేరింది. బిల్లు చట్టబద్ధతను న్యాయశాఖ, న్యాయ వ్యవహారాల శాఖ పరిశీలిస్తున్నాయని హోం శాఖ ప్రతినిధులు సమాచారం ఇచ్చారు. రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఈ బిల్లు ప్రాసెస్ అయ్యే అవకాశం ఉన్నది’ అని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 11: కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం ప్రత్యుత్తరం పంపారు. ‘రిజర్వేషన్ల బిల్లుపై మీరు రాసిన లేఖ అందింది’ అని పేర్కొన్నారు.
మార్చి 7: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌కు ప్రత్యేకంగా లేఖ రాశారు. ‘ఏపీ అసెంబ్లీ బీసీ-ఈ వర్గానికి 4% రిజర్వేషన్ కల్పించడాన్ని సుప్రీంకోర్టు పలుమార్లు నిలిపివేసింది. ఈ అంశం ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నది. సుప్రీం తుదితీర్పునకు అనుగుణంగా తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపు బిల్లు అంశాన్ని ప్రాసెస్ చేస్తాం’ అని స్పష్టంచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పంపిందని, తమ పరిశీలనలో ఉన్నదని స్వయంగా ఒప్పుకొన్న కేంద్రం.. ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా ప్లేటు ఫిరాయించింది. రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానం ఇస్తూ.. ‘రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన మాకు రాలేదు’ అని చెప్పారు. వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టినపుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యేగా చర్చలో పాల్గొని బిల్లుకు మద్దతు కూడా ప్రకటించారు. ఇది తెలిసీ.. కేంద్రం పార్లమెంటులో తప్పుడు సమాచారమిచ్చినప్పుడు అది తప్పు అని ఉత్తమ్ ఖండించకపోవడం గమనార్హం. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి కూడా గిరిజన రిజర్వేషన్ల అంశానికి మద్దతు ఇచ్చారు. ఆయన కూడా ఈ వ్యవహారంపై పెదవి విప్పకపోవడం రెండు జాతీయ పార్టీల దుర్మార్గాన్ని బట్టబయలు చేస్తున్నది.
2015 మార్చి 3: చెల్లప్ప కమిషన్ నియామకం
2016 డిసెంబర్ 8: ఎస్టీల రిజర్వేషన్ 10 శాతానికి పెంచాలని కమిషన్ సిఫారసు
2017 ఏప్రిల్ 12:కమిషన్ సిఫారసులకు ఆమోదం
ఏప్రిల్ 15: ఎస్టీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం
ఏప్రిల్ 16: రిజర్వేషన్ పెంపు బిల్లుపై అసెంబ్లీ, మండలిలో చర్చ, ఆమోదం.
మే 24: గవర్నర్ ఆమోదం
మే 29: కేంద్ర హోంశాఖకు చేరిన బిల్లు 6 ప్రతులు
డిసెంబర్ 18: బిల్లుకు మద్దతు తెలియజేస్తున్నామన్న కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ. రిజర్వేషన్ 9.08 శాతానికి తగ్గకూడదని స్పష్టీకరణ.
2018 ఏప్రిల్ 26: కేంద్ర హోం శాఖ కోరిన వివరణలకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి జవాబు.
ఏప్రిల్ 27: బిల్లుపై కేంద్ర హోం శాఖ సమీక్ష
ఆగస్టు 4: ప్రధానికి లేఖ రాసిన సీఎం కేసీఆర్
2019 అక్టోబర్ 4: ప్రధాని మోదీకి రెండోసారి లేఖ
2021 ఫిబ్రవరి 5: కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ లేఖ
2022 ఫిబ్రవరి 1: కేంద్ర గిరిజన వ్యవహారాలు, హోం మంత్రులకు మంత్రి రాథోడ్ లేఖ
ఫిబ్రవరి 9: రిజర్వేషన్ల పెంపు బిల్లు కేంద్రం వద్ద ఉన్నదని, సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ప్రాసెస్ చేస్తామని కేంద్ర మంత్రి అర్జున్ ముండా హామీ
ఫిబ్రవరి 11: సత్యవతి రాథోడ్ రాసిన లేఖ అందిందన్న కేంద్ర హోంమత్రి అమిత్‌షా.
మార్చి 7: రిజర్వేషన్ల పెంపు బిల్లు తమ పరిశీలనలో ఉన్నదని, కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా.
2018 ఆగస్టు 4: ‘తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంతో పోల్చితే ఎస్టీల జనాభా 7.11% నుంచి 9.08 శాతానికి పెరిగింది. ముస్లింల జనాభా 9.56% నుంచి 12.68 శాతానికి పెరిగింది. బీసీల జనాభా 50% దాటిపోయింది. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేయాలంటే రిజర్వేషన్లను సవరించాల్సిన అవసరమున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నియమించిన కమిషన్లు ఎస్టీలకు రిజర్వేషన్ 6 నుంచి 10 శాతానికి, ముస్లింలకు 4 నుంచి 12 శాతానికి పెంచాలని ప్రతిపాదించాయి. ఈ మేరకు రిజర్వేషన్లను పెంచేలా అసెంబ్లీలో బిల్లులు చేసి కేంద్రానికి పంపించాం. ఇవి కేంద్ర హోం శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాను’ అని పేర్కొన్నారు.
2019 అక్టోబర్ 4: ‘రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు చెప్తూనే.. తప్పనిసరి పరిస్థితుల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించవచ్చన్నది. ఈ మేరకు తమిళనాడు 69% రిజర్వేషన్లు అమలు చేస్తున్నది. కాబట్టి తెలంగాణలో ముస్లింలు, ఎస్టీలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లు పెంచడం సబబే. ఆయా వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్ల పెంపు బిల్లులను ప్రాసెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను’ అని పేర్కొన్నారు.