e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, December 6, 2021
Home News ఓట్ల కోసం కాదు.. ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్నాం: మంత్రి హరీశ్‌

ఓట్ల కోసం కాదు.. ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్నాం: మంత్రి హరీశ్‌

గజ్వేల్‌: రాష్ట్రంలో 90.5 శాతం జనాభా రేషన్‌ బియ్యం అందిస్తున్నామని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఇలా 90 శాతానికిపైగా జనాభాకు పీడీఎస్‌ ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. పార్టీలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్నామని, తాము ఓట్ల కోసం కాదు.. ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని తెలిపారు. గజ్వేల్‌లో ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డితో కలిసి లబ్దిదారులకు రేషన్‌ కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదలందరికీ రేషన్‌ కార్డులు అందిస్తున్నామన్నారు. ప్రతి పేదవాడి కడుపు నింపడమే‌ సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. ప్రజల‌ కష్టాలే తమ ఎజెండా అన్నారు.

ఇప్పటివరకు 87.41 లక్షల మందికి రేషన్‌ కార్డులు అందించామని, కొత్తగా మరో 3,09,083 కార్డులు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో అన్నిరకాల కార్డులు 90 లక్షల 50 వేలకు చేరాయని, మొత్తం 2,79,23,000 మంది లబ్దిదారులు ఉన్నారని చెప్పారు. కొత్త కార్డుల ద్వారా నెలకు అదనంగా రూ.14 కోట్ల విలువగల 5,200 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రజా పంపిణీ కోసం ప్రభుత్వం ప్రతి నెల దాదాపు రూ.231 కోట్లు, ఏడాదికి రూ.2766 కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నదని వెల్లడించారు.

- Advertisement -

కల్యాణ లక్ష్మి పథకం వద్దని బీజేపీ నేతలు చెబుతున్నారని విమర్శించారు. బీజేపీ పాలిత 16 రాష్ట్రాల్లో ఇలా పేదింటి ఆడపిల్ల పెండ్లికి సాయం అందిస్తున్నారా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల కోసమే పనులు‌చేస్తుందని కొందరు విమర్శలు చేస్తున్నారని, తమది తెలంగాణ కోసం, ప్రజల కోసం పని చేసే పార్టీ అని స్పష్టం చేశారు. ప్రజలు తెలివైన వారని, అంతిమంగా పని చేసేవాళ్లకే తమ మద్ధతిస్తారని చెప్పారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement