శ్రీశైలం : తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కుటుంబ సమేతంగా శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ ప్రధాన గోపురం వద్ద దేవస్థానం ఈవో లవన్న ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.