శేరిలింగంపల్లి, అక్టోబర్ 1: గోపన్‌పల్లిలోని ప్రభుత్వ స్థ్ధలం సర్వేనం.34లో భారీగా మట్టి డంపింగ్ చేయడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నేపధ్యంలో హైడ్రా అధికారులు స్పందించారు. గురువారం హైడ్రా ఎస్పీ ఆనంద్, డీఎస్పీ తిరుమల్, సీఐ నరేష్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రభుత్వ స్థ్ధలంలో జరుగుతున్న మట్టి డంపింగ్‌ను పరిశీలించారు. మట్టి డంపింగ్ కారణంగా సమీపంలోని ఇండ్లలో నివసిస్తున్న వారికి ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రమాదాలపై గోపన్‌పల్లి తండా వాసులను అడిగి తెలుసుకున్నారు.
నెలరోజులుగా భారీ చేపడుతున్న మట్టి డంపింగ్‌తో తమ ఇండ్లకు ముప్పు పొంచిఉందని, 20 పీట్లకు పైగా ఎత్తులో మట్టిని టిప్పర్ల ద్వారా డంపింగ్ చేస్తున్నారని ఫలితంగా తమ ఇండ్లు ఇబ్బందుల్లో పడతాయని, వర్షాలకు మట్టి జారి ఇండ్లపైకి చేరుతుందని ఆవేదన వ్యక్తం తమ సమస్యను అర్థ్ధంచేసుకొని ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులకు విన్నవించారు. ఇకపై మట్టి డంపింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారని స్థానికులు ‘నమస్తే తెలంగాణ’తో పేర్కొన్నారు. అక్కడ పోసిన మట్టికి తమకు సంబంధం లేదని, కాంట్రాక్టర్ చేసిన దానికి హైడ్రాకు ముడిపెట్టొద్దని, ఇండ్లలోకి నీరువచ్చి ప్రమాదాలు జరిగితే సహాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధ్దంగా ఉన్నామని హైడ్రా అధికారులు పేర్కొన్నట్లు స్థ్ధానికులు తెలిపారు.