Minister Gangula | అభివృద్ది, ఆహ్లాదం, ఆధ్యాత్మికతకు నెలవు కరీంనగర్ : మంత్రి గంగుల
Minister Gangula | అభివృద్ధి, ఆహ్లాదం, ఆధ్యాత్మికం కలిసి ఉన్నదే కరీంనగర్ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. శుక్రవారం కరీంనగర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు.
కరీంనగర్ : అభివృద్ధి, ఆహ్లాదం, ఆధ్యాత్మికం కలిసి ఉన్నదే కరీంనగర్ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. శుక్రవారం కరీంనగర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కిసాన్ నగర్లో పర్యటించినప్పుడు ఇక్కడ గుంతలమైన రోడ్లు దుర్గంధం వేదజల్లే డ్రైనేజీలే కనిపించాయని..సమైక్య పాలనలో మౌలిక సౌకర్యాలు లేక అరిగోస పడ్డ రోజులు గుర్తున్నాయన్నారు.
కిసాన్ నగర్లో ఉండేది పేదలేనని, వారికి కనీస సౌకర్యాలు కల్పించాలనే మనస్సు నాటి సమైక్య పాలకులకు రాలేదన్నారు. స్వయం పాలనలో కరీంనగర్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వేలకోట్ల రూపాయలు విడుదల చేస్తున్నారన్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ చేతిలోనే తెలంగాణ క్షేమంగా ఉంటుందని, ఢిల్లీ పాలకుల చేతుల్లోకి మళ్లీ అధికారాం వెళ్తే రాష్ట్రం అస్తవ్యస్తమై మళ్ళీ గుడ్డిదీపం అవుతుందన్నారు.
కాంగ్రెస్, బీజేనపీ నాయకులు ఎన్నికలప్పుడు తప్పా మళ్లీ ఎప్పుడు కనిపించర, ఎన్నికలవేళ కనిపించి మాయమయ్యే నాయకులు కావాలా..లేక నిత్యం ప్రజల్లో ఉండి సమస్యలు పరిష్కరించే పాలకులు కావాలా మీరే ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్,బీజేపీలకు ఓటు వేస్తే ఢిల్లీకి ఓటు వేసినట్టేనని తెలిపారు. గడిచిన 10 సంవత్సరాల్లో కరీంనగరాన్ని వేల కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. బీఆర్ఎస్ పార్టీని మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

