కరీంనగర్ : పార్టీలకు అతీతంగా కరీంనగర్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్‌లోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు మంత్రి సోమవారం భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నగర పౌరుల గౌరవం పెరిగేలా అద్భుత నగరంగా తీర్చిదిద్దుతున్నామని, భవిష్యత్ తరాలకు గొప్ప నగరాన్ని అందించాలన్నదే తమ లక్ష్యం అని అన్నారు.
ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు అని, గెలిచిన తరవాత అందరూ నావల్లేనని, తనని నమ్మి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. నగరంలో 50 ఏళ్లలో జరగని అభివృద్ధి పనులు నేడు జరుగుతున్నాయని, గతంలో ఉన్న నాయకులు కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే రావడంతో నగర అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఎక్కడ చూసినా గుంతల రోడ్లతో నగరానికి వచ్చేందుకు వెనుకాడే వారని, నేడు కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన పనులతో నగరం అద్భుతంగా మారిందని పేర్కొన్నారు.
అభివృద్ధి ఇలాగే కొనసాగాలని కోరారు. ఎన్నికల వేళ..పచ్చని తెలంగాణలో విషం చిమ్మేందుకు కాంగ్రెస్..బీజేపీలు విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. ఆయా పార్టీల పట్ల అఫ్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని, మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునిల్ రావు, నగర డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.