కరీంనగర్ : కరీంనగర్ సంఘటనపై పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమన్న మంత్రి బాధితులకు అండగా ఉంటామన్నారు.
కాగా, ఆదివారం కరీంనగర్ పట్టణంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు..పట్టణంలోని కమాన్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న గుడిసెల్లోకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.