మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 10:21:44

క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ ద్వారా 7 ల‌క్ష‌ల కుటుంబాల‌కు ల‌బ్ది

క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ ద్వారా 7 ల‌క్ష‌ల కుటుంబాల‌కు ల‌బ్ది

హైద‌రాబాద్ : క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ పథ‌కాలు దేశంలోని ఏ రాష్ర్టాలు అమ‌లు చేయ‌డం లేదు అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ తెలిపారు. అసెంబ్లీలో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఈ ప‌థ‌కాల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం ఇచ్చారు. మాన‌వ‌తా కోణంలో సీఎం కేసీఆర్ ఆలోచించి ఈ ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న చేశారు. ప్రేమ వివాహం చేసుకున్నా కూడా త‌ల్లి పేరు మీద‌నే క‌ల్యాణ‌ల‌క్ష్మి చెక్కు వ‌స్తుంది. క‌రోనా స‌మ‌యంలో కూడా ఈ ప‌థ‌కానికి వెయ్యి కోట్లు కేటాయించింది. ఈ చెక్కులు అందుకున్న స‌మ‌యంలో ఆ త‌ల్లులు ఆనంద భాష్పాలు రాలుస్తున్నారు అని పేర్కొన్నారు.

2014-15 నుంచి 2020-21 వ‌ర‌కు ఈ తేదీ వ‌ర‌కు బీసీలు, ఈబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల‌కు క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ ప‌థ‌కాల ద్వారా 7,14,575 మంది కుటుంబాల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగింద‌ని మంత్రి తెలిపారు. క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ ప‌థ‌కాల ద్వారా 2014-15 నుంచి 2020-21 కాలంలో రూ. 5,556.44 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. 3,04,206 కుటుంబాలు(రూ. 2,523.68 కోట్లు), 1,62,079 కుటుంబాలు(రూ. 1,197.6 కోట్లు), 94,193 గిరిజ‌న కుటుంబాలు(రూ. 701 కోట్లు), 1,54,097 కుటుంబాలు(రూ. 1134 కోట్లు)కు ల‌బ్ది చేకూరింద‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌ తెలిపారు. 


logo