హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): బీసీ కులవృత్తి, చేతివృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించేందుకు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైనట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.
ఈ సాయం కోసం బీసీ-ఏ క్యాటగిరీ నుంచి 2,66,001, బీ క్యాటగిరీ నుంచి 1,85,136, డీ క్యాటగిరీ నుంచి 65,310, ఎంబీసీల నుంచి 12,415 చొప్పున మొత్తంగా 5,28,862 దరఖాస్తులు వచ్చాయని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వీటిని క్రమసంఖ్య ప్రకారం క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలిస్తున్నారని, ప్రతి నెలా 5లోగా వెరిఫికేషన్ పూర్తయినవారికి అదే నెల 15న స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా లక్ష సాయం అందజేయనున్నారని మంత్రి గంగుల వివరించారు.