కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 18: కరీంనగర్ ఎంపీగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకుండా.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బండి సంజయ్‌కి ఇక్కడి ప్రజల ఓట్లు అడిగే అర్హత లేదని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
శనివారం కరీంనగర్ రూరల్ మండలంతోపాటు నగరంలోని పలు డివిజన్లలో ప్రచారం చేశారు. ఆయాచోట్ల మంత్రి గంగు ల మాట్లాడుతూ.. బండిపై బీజేపీ అధిష్ఠానమే అవినీతి ఆరోపణలు చేసి రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిందని అన్నారు.