సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 21, 2020 , 02:20:55

కరోనాపై నియంత్రణే మార్గం

కరోనాపై నియంత్రణే మార్గం

  • వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం అన్నివిధాలా చర్యలు చేపట్టిందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ప్రజలు కూడా సమాయత్తం కావాలని సూచించారు. శుక్రవారం కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ రూంలో వైద్యారోగ్యశాఖ అధికారులు,  ఐఎంఏతోపాటు వైద్య సంఘాల ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన  కరోనా నియంత్రణ చర్యలను కేంద్రం ప్రశంసించిందని చెప్పారు. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చినవారికే వైరస్‌ సోకిందని, రాష్ట్ర ప్రజలెవరికీ సోకలేదని స్పష్టంచేశారు. 

జన్మదిన వేడుకలకు ఈటల దూరం

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శుక్రవారం తన జన్మదిన వేడుకలను నిర్వహించుకోలేదు. రోజంతా సమీక్షలు, సమావేశాలు, ప్రణాళికల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. మంత్రి ఈటల రాజేందర్‌కు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, మంత్రి కే తారకరామారావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుఖసంతోషాలతో నిండు నూరేండ్లు జీవించాలని, ప్రజా సేవ అందించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌చేశారు.


logo