హైదరాబాద్ : ప్రముఖ సినీ, తెలంగాణ గేయ రచయిత కందికొండ యాదగిరి పార్థివ దేహానికి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సబ్బండ వర్ణాల సంస్కృతిని తన పాట ద్వారా అజరామరంగా నిలిపిన, వరంగల్లు బిడ్డ కందికొండ అన్నారు. ఆయన మరణం తెలంగాణ సాహిత్య లోకానికి తీరని లోటని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.