వరంగల్ : తెలంగాణ రైతులు పండించిన యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో సోమవారం టీఆర్ఎస్ నిరసన దీక్షలు చేపట్టింది. ఈ నిరసన దీక్షను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వినూత్నంగా చేపట్టారు. రాయపర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ చేపట్టిన నిరసన దీక్షకు మంత్రి ఎడ్ల బండిలో ర్యాలీగా తరలి వచ్చి టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. కేంద్రం వడ్లను కొనుగోలు చేసే వరకు ఉద్యమం ఆగదని మంత్రి తెలిపారు.