పాలకుర్తి : తెలంగాణ తరహా అభివృద్ధి ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా జరుగలేదని తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. పాలకుర్తి నియోజకవర్గ సోషల్ మీడియా(Social Media) వారియర్స్ తో ఆదివారం పాలకుర్తిలో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్(CM KCR )ను, తెలంగాణ ప్రభుత్వాన్ని బాదనాం చేయడానికి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని సోషల్ మీడియా వేదిక ద్వారా వివరించాలని ,ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై వెంటనే ఘాటుగా స్పందించాలని వారియర్స్‌కు సూచించారు. ప్రజలకు సీఎం కేసీఆర్ చేస్తున్నంత గా మరెవ్వరూ చేయలేదని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే శ్రీరామరక్షఅని వెల్లడించారు.
కేసీఆర్‌ను మరోసారి గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వివరించారు. బీఆర్ఎస్(BRS) పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ శ్రేణులతో పాటు సోషల్ మీడియా వారియర్లుగా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సోషల్ మీడియా వారియర్స్, యూత్ నాయకులు పాల్గొన్నారు.