హనుమకొండ : గత పాలకుల నిర్లక్ష్యంతోనే తెలంగాణ అభివృద్ధి చెందలేదని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఐనవోలు మండలం నందనం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు సేవా సహకార భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. నందనం గ్రామంలో చెక్ డ్యామ్ కట్టించినా కరెంట్ కోతలతో రైతులు ఆందోళన చేసేవారు. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చారన్నారు.
బీజేపీ ప్రభుత్వం రైతులకు మీటర్లు పెట్టాలని కుట్ర పన్నిందన్నారు. దానకి కేసీఆర్ ఒప్పుకోలేదని తెలిపారు. వచ్చే వర్షాకాలంలోగా ఐనవోలు మండలానికి సాగు నీరు అందించేలా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనమంటే కొనడం లేదని, బీజేపీ అంటేనే బోగస్ పార్టీ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎద్దేవా చేశారు. అలాంటి నేతలను గ్రామాల్లో నుంచి తరిమి వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.