జనగామ : తెలంగాణ రాష్ట్రంలో పేదింటి పెద్దన్నగా సీఎం కేసీఆర్ నిలిచిపోయారని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 99 మంది పేదింటి ఆడబిడ్డలకు పాలకుర్తిలో గల క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లిమాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఆడబిడ్డ పెండ్లికి మేనమామగా మారి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
ఇలాంటి పథకం దేశంలో ఎక్కడ లేదన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రజల కోసమే పనిచేస్తూ, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి మనమంతా అండగా ఉండాలన్నారు. మరోసారి BRS పార్టీని ఆశీర్వదించి అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.