గవర్నర్ వ్యవస్థను తాము కించపర్చడం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. గవర్నర్ మహిళా దర్బార్‌పై నిజామాబాద్‌లో శనివారం ఆయన స్పందించారు. గవర్నర్ వ్యవస్ధను రాజకీయంగా వాడుకోవడం మంచిది కాదని ఎర్రబెల్లి తెలిపారు. సీఎం కేసీఆర్‌ను అవమానపరిచేలా గవర్నర్ వ్యవహరిస్తే తెలంగాణ ప్రజలు సహించబోరని పేర్కొన్నారు.
గతంలో ఓ గవర్నర్ ఎన్టీఆర్ ను అవమానిస్తే ప్రజలు ఎలా తిరగబడ్డారో గుర్తుచేసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్ ను అవమానిస్తే అదే పరిస్థితి పునరావృతమవడం ఖాయమని పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ వైఖరి ఎలా ఉండబోతున్నదో రెండు మూడు రోజుల్లో సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.