జనగామ : ఢిల్లీలో జరిగిన పంచాయతీ రాజ్ జాతీయ అవార్డులు(National Awards) పొంది వచ్చిన రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు( Minister Errabelli )ను జిల్లా అధికారులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాధించిన 13 అవార్డులను భారత రాష్ట్రపతి(India President) ద్రౌపది ముర్ము చేతుల మీదుగా, మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో ఆయా గ్రామాల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇటీవల అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన మంత్రిని జనగామ జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయి శాలువాతో అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామం సమృద్ధిగా మంచినీరు ఉన్న విభాగంలో దేశంలో నెంబర్ వన్ గా నిలవడం పట్ల కలెక్టర్, అడిషనల్ కలెక్టర్‌ను మంత్రి అభినందించి సత్కరించారు.