ములుగు: జిల్లాలో గోదావరి వరదతో నీటమునిగిన ఏజెన్సీ ప్రాంతాల్లో మంద్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. గోదావరి నది ఉధృతిని, ముంపు ప్రాంతాలు, వర్షాలతో దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించారు. వరద సహాయక, పునరావాస చర్యలను పర్యవేక్షించారు. ముంపు బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయంలో వరద పరిస్థితులపై అధికారులతో సమావేశం కానున్నారు.