వరంగల్ : టీఆర్ఎస్ వరంగల్ జిల్లా కార్యాలయం నిర్మాణానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లాకు ఓ కార్యాలయం చొప్పున పార్టీ కార్యాలయాలు నిర్మిస్తుండగా.. తుది దశకు చేరుకున్నాయని, వరంగల్లో కార్యాలయ నిర్మాణానికి సరైన స్థలం దొరక్క పోవడంతో ఆలస్యమైందన్నారు. ప్రస్తుతం ఓ సిటీలోని స్థలాన్ని పరిశీలించామన్నారు. త్వరలో స్థలాన్ని గుర్తించి నిర్మాణం పనులు ప్రారంభిస్తామన్నారు. ఉమ్మడి వరంగల్ పరిధిలోని మిగతా జిల్లాల్లో కార్యాలయాలు సిద్ధమవుతున్నాయన్నారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా త్వరలో ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, నన్నపునేని నరేందర్ తదితరులు ఉన్నారు.