Minister Dayakar Rao | వల్మిడిలో ఘనంగా శ్రీరామ నవమి ఉత్సవాలు : మంత్రి ఎర్రబెల్లి
Minister Dayakar Rao | వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయానికి భద్రాద్రికి మించిన వైభోగం దక్కేలా అభివృద్ధి చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వల్మిడి సీతారామస్వామి ఆలయం కల్యాణోత్సవాల ఏర్పాట్లపై మంత్రి ఆదివారం సమీక్ష నిర్వహించారు.
Minister Dayakar Rao | పాలకుర్తి : వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయానికి భద్రాద్రికి మించిన వైభోగం దక్కేలా అభివృద్ధి చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. భద్రాద్రి ఉన్నంత చరిత్ర వల్మిడి ఆలయానికి ఉందన్నారు. మిగతా దేవాలయాలకు భిన్నంగా ఈ ఆలయానికి ఎకరాల కొద్ది స్థలం ఉందని, దాన్ని విస్తృతంగా అభివృద్ధి చేసే అవకాశం మెండుగా ఉందన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా జనగామ జిల్లాలోని వల్మిడి సీతారామస్వామి ఆలయం కల్యాణోత్సవాల ఏర్పాట్లపై మంత్రి ఆదివారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రాముడు నడయాడిన నేలగా, రామాయణకర్త వాల్మీకి మహర్షి తపస్సు చేసిన గుట్టగా వల్మిడి చరిత్ర, గుర్తింపు, గౌరవం ఉన్నాయన్నారు. గుట్టను విస్తృతంగా అభివృద్ధి చేస్తూ దేవాలయంలో రూ.11.40 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. కళ్యాణ మండపం, గుట్ట మీదకు రోడ్డు సదుపాయం కల్పిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ సైతం పాలకుర్తి, బమ్మెర, వల్మిడి గ్రామాలను కలుపుతూ ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు అడిగిన వెంటనే నిధులు మంజూరు చేశారన్నారు.
గతంలో ఎన్నడూ కనీవినీ ఎరగని రీతిలో వల్మీడి దేవాలయంలో ఈసారి శ్రీరామనవమి ఉత్సవాలు శ్రీ సీతారామచంద్రస్వామిల కల్యాణం కనుల పండువగా నిర్వహించనున్నామన్నారు. ఈ మేరకు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నవమి నాటికి కల్యాణ మండపాన్ని సిద్ధం చేయాలని సూచించారు. మహిళల కోసం ప్రత్యేకంగా 15 మొబైల్ టాయ్‌లెట్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాట్లకు సంబంధించిన బాధ్యతలను ఆయా విభాగాల అధికారులకు అప్పగించారు. నవమి రోజున భక్తులకు అన్నదానం చేయనున్నట్లు తెలిపారు.
ఈ మేరకు భక్తులంతా సకుటుంబ సపరివాతర సమేతంగా రావాలని ఆహ్వానించారు. మరో వైపు ఉత్సవాల కోసం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రూ.5లక్షలు విరాళం ప్రకటించారు. కళాకారులతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో కళాకారులతో వివిధ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. దేవస్థాన ధర్మకర్తల మండలి అధికారులు సమన్వయంతో పని చేస్తూ వివిధ కమిటీలను ఏర్పాటు చేసుకొని ఆయా కమిటీల ఆధ్వర్యంలో ఆయా పనులను సరిగ్గా నిర్వర్తిస్తూ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సమగ్రంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

