రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 64వ పుట్టిన రోజును పురస్కరించుకుని, ఆయన కోరిక మేరకు జన్మదిన వేడుకలు అత్యంత నిరాడంబరంగా జరిగాయి. సీఎం గారి పిలుపు హరితహారం, ఎంపీ జోగిన పల్లి సంతోశ్ పిలుపు మేరకు గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మంత్రి సతీమణి, ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్పర్సన్ శ్రీమతి ఉషా దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గం మొత్తం పర్యటించారు.
ఈ సందర్బంగా ఆమె ఆయా చోట్ల ప్రజా ప్రతినిధులు, ప్రజలతో కలిసి మొక్కలు నాటారు. అలాగే మంత్రి పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు, పార్టీ శ్రేణులు, దయన్న అభిమానులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. గ్రామానికి కనీసం 100 చొప్పున 10వేలకు పైగా మొక్కలు నాటారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆటా 17వ మహా సభల కోసం అమెరికా వెళ్ళారు. అయితే తన జన్మదిన వేడుకులను నిరాడంబరంగా జరుపుకోవాలని, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా హరితహారం మొక్కలు నాటాలని, అలాగే రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోశ్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని, పేదలకు, రోగులకు పండ్లు పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునందుకుని ఆయన సతీమణి, ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీమతి ఉషా దయాకర్ రావు నియోజకవర్గం మొత్తం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ఆధ్వర్యంలో ఆయా మండల కేంద్రాలు, గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు, దయన్న అభిమానులతో కలిసి మొక్కలు నాటారు.
రాయపర్తి, కొడకండ్ల, తొర్రూరు, పెద్ద వంగర, పాలకుర్తి, దేవరుప్పుల మండలాలు, ఆయా గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటారు. తొర్రూరు మండలం మడిపల్లి బ్రిడ్జీ వద్ద కొందరు ఆయన అభిమానులు భారీ కటౌట్ కట్టి పుట్టిన రోజు వేడుకలు చేశారు. పాలకుర్తి హాస్పిటల్లో రోగులకు పండ్లు, పేదలకు హెల్మెట్ల పంపిణీ చేశారు. పాలకుర్తిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులంతా కలిసి ‘‘ఈడీఆర్ హ్యాపీ బర్త్‌డే (edr happy birthday) ఆకారంలో నిలిచి ఉత్సవాలు చేశారు. పాలకుర్తి క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేశారు.
సోమేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు. ఎర్రబెల్లి ట్రస్ట్ అధ్వర్యంలో నడుస్తున్న ఫ్రీ కోచింగ్ సెంటర్ లో కేక్ కటింగ్ చేశారు. తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన, తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని, తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తానని, పేరుపేరునా ప్రతి ఒక్కరికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు.