
హైదరాబాద్, జనవరి 27 : రాష్ట్రంలో పీఎంజీఎస్‌వై రోడ్ల పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కేంద్రానికి తెలిపారు. ఈ పనులు అత్యంత వేగంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తయ్యేవిధంగా రాష్ట్ర అధికారులు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన రోడ్ల పనులపై కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి గిరిరాజ్‌సింగ్ గురువారం ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల మంత్రులు, కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లితో పాటు శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఇతర అధికారులు సెక్రటేరియట్ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రాష్ట్రం వాటా, కేంద్రం వాటా, మెయింటెనెన్స్ నిధులు వేగంగా అందేట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడతామని హామీ ఇచ్చారు. పీఎంజీఎస్‌వై తోపాటు నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకాలపై కూడా సమీక్ష జరిగింది.