12 కోట్ల ‘ఉపాధి’ పనిదినాలు కావాలి
రాష్ర్టానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 12 కోట్ల పనిదినాలు కేటాయించాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, కొత్త రోడ్ల పనుల పురోగతి, ఉపాధి హామీ
- కేంద్రానికి మంత్రి ఎర్రబెల్లి వినతి
హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 12 కోట్ల పనిదినాలు కేటాయించాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, కొత్త రోడ్ల పనుల పురోగతి, ఉపాధి హామీ పథకం పనిదినాలు, పనులు, నిధులపై సోమవారం అధికారులతో సమీక్షించారు. హైదరాబాద్‌లోని మంత్రి చాంబర్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, డైరెక్టర్ హన్మంతరావు, ఉపాధి, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ కమిషనర్ ప్రసాద్‌తో జరిగిన ఈ సమీక్షలో మంత్రి మాట్లాడారు.
పంచాయతీరాజ్‌శాఖ సీసీ రోడ్ల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మరమ్మతులకు టెండర్లు పిలువని జిల్లాల్లో వెంటనే పిలువాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది ఇప్పటికే 10.5 కోట్ల పనిదినాలు పూర్తి చేశామని, వచ్చే ఏడాదికి 12 కోట్ల పనిదినాలకు పెంచాలని కేంద్రానికి పంపనున్న ప్రతిపాదనలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. అధికారుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన దాదాపు రూ.800 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ నిధుల విడుదలకు కృషి చేయాలని మంత్రి సూచించారు. ఆ తర్వాత ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా అన్ని జిల్లాల డీఆర్డీవోలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని గ్రామపంచాయతీల పరిధిలో ఉపాధి పనులను విధిగా ప్రారంభించాలని, ప్రతి జిల్లాలో 10వేల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యేలా కార్యచరణ రూపొందించాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

