Telangana | హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతున్నది. దొంగలకు పోలీసులంటే భయమే లేకుండా పోయింది. ఎంతగా అంటే ఏకంగా మంత్రుల ఇండ్లకే కన్నం పెట్టేంత దారుణంగా మారింది. సాక్షాత్తు మంత్రుల ఇండ్లకే దొంగలు కన్నాలు వేస్తుంటే.. ఇంక సామాన్యుల పరిస్థితి ఎంత ఘోరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ‘మా ఇండ్లలో డబ్బులు, నగలు మాయమయ్యాయి’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. తాజాగా ‘నా సెల్‌ఫోన్ చోరీ అయింది బాబోయ్.. వెంటనే వెతికి పెట్టండి’ అంటూ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సైబర్ క్రైమ్ పోలీసులకు మొర పెట్టుకుట్టుకున్నారు.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఉంటున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సెల్‌ఫోన్ అక్టోబర్ 31 దీపావళి రోజున చోరీ అయింది. దీంతో ఫోన్‌ను వెతికి పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీకి పాల్పడిన బిహార్‌కు చెందిన రోషన్‌కుమార్ మండల్, ఉదయ్‌కుమార్ ఠాకూర్‌ను ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్లో బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నుంచి రూ.2.2 లక్షలు, 100 గ్రాముల బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఇంట్లో దొంగలు చొరబడి విలువైన డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లిన ఘటన ఆసిఫాబాద్‌జిల్లా కాగజ్‌నగర్ మండ లం కోసిని వైష్ణవి డెవలప్మెంట్లో జరిగింది.
రాష్ట్రంలో పేట్రేగిపోతున్న దొంగలు..
‘పాత చెప్పైనా బంగారమే’ అన్నట్టు ఎక్కడెక్కడి నుంచో వస్తున్న దొంగలు రాష్ట్రంలో ప్రజల ఆస్తులను దోచుకుంటున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా పట్టపగలే తాళాలు పగులగొట్టి ఇండ్లలోకి దూరి చోరీలు చేస్తున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. ఏ జిల్లా చూసినా.. ఒక్కో నెలలో వందలాది చోరీల కేసులు నమోదవుతున్నాయంటే దొంగలు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారో తెలుస్తున్నది. కేవలం చోరీల కోసమే కొన్ని అంతర్రాష్ట్ర ముఠాలు తెలంగాణ సరిహద్దుల్లో తిష్టవేశాయంటే పోలీసులంటే భయం ఏమాత్రం వారిలో ఉందో ఇట్టే అర్థమవుతున్నది.
ఇటీవల జరిగిన ప్రధాన చోరీలు