హైదరాబాద్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సూ క్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) విధానంలో మహిళలు, వెనుకబడిన తరగతులు, దళిత పారిశ్రామిక వేత్తలకు ప్రా ధాన్యం ఇవ్వనున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మంగళవారం రాష్ట్రస్థాయి జిల్లా పరిశ్రమల కేంద్రాల జనరల్ మేనేజర్ల సమావేశం జరిగింది.
ఈ సందర్భం గా ఎంఎస్ఎంఈ హ్యాండ్‌బుక్‌ను మంత్రి ఆ విష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీలు ప్రధాన లబ్ధిదారులుగా ఉన్న పీఎం విశ్వకర్మ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు. జైకా మద్దతుతో చేపడుతున్న ఎంఎస్ఎంఈ పథకాలు గరిష్ఠ స్థాయిలో కార్యరూపం దాల్చేలా చర్య లు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ డాక్టర్ మల్సూర్, ఉన్నతాధికారులు ఎస్ స్వా మినాథన్, రామానంద శుక్లా, గౌరి మొన్వా నీ, ఆర్ శ్రీనివాస్, రవివర్మ, బావయ్య పాల్గొన్నారు.
అహ్మదాబాద్‌లోని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో తెలంగాణలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. మంగళవారం ఈడీఐఐ డైరెక్టర్ జనరల్ సునీల్ శుక్లా సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో సమావేశమై శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించారు.