హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ త్యాగానికి, ప్రేమ, కరుణకు తార్కాణంగా జరుపుకుంటారన్నారు. రాష్ట్రంలోని క్రిస్టియన్లందరు పండుగను సంతోషంగా, ఆహ్లాదకర వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో క్రిస్టియన్ల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. వారికి దుస్తుల పంపిణీ, హైదరాబాద్లో ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వారికి గుర్తింపు ఇస్తున్నారని దయాకర్ రావు అన్నారు. మానవత్వాన్నిచాటే ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయన్నారు. శాంతి, కరుణ, సహనం, ప్రేమతో జీవించిన క్రీస్తు జీవనగమనం, నేటికీ అందరికీ ఆచరణీయమని మంత్రి అన్నారు.