హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): ఆహారం కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకొంటామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. మంగళవారం సచివాలయంలో ‘రాష్ట్ర ప్రభు త్వం – కమిషనర్ ఫుడ్ సేఫ్టీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి దామోదర మాట్లాడుతూ… హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయ గుర్తింపు ఉన్నదని చెప్పారు. హోటళ్ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. సమావేశం లో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ డాక్టర్ శివలీల, తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, ఇండియన్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సందీప్, సుల్తాన్ మసతి, తదితరులు పాల్గొన్నారు.