హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) కొనసాగుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను మంత్రి భట్టివిక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,75,891 కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.29,669 కోట్లు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుకు రూ. 53,196 కోట్లు ప్రతిపాదించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కేటాయింపు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రమే చేయడం జరిగిందన్నారు. హామీలకు సంబంధించిన విధివిధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున, అది పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన పూర్తి నిధులు కేటాయిస్తాం అని విక్రమార్క తెలిపారు. శాసన మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను చదివివినిపిస్తున్నారు.