హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): పాఠ్యాంశాల బోధనకే పరిమితమైపోకుండా, విద్యార్థులను సమగ్ర పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గురుకుల ప్రిన్సిపళ్లు కృషి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు.
ఎస్సీ గురుకుల సొసైటీ ప్రిన్సిపళ్లు, ఉన్నతాధికారులకు ఏర్పాటు చేసిన రెండు రోజుల ఓరియంటేషన్ కార్యక్రమం గురువారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థులకు నైపుణ్యాలు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించాలని, వారిని సమగ్ర పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు.